: చైతూ, సమంతల పెళ్లెప్పుడో?... వివాహ వేడుకకు జంటగా వెళ్లిన స్టార్స్!
తెలుగు సినీ రంగంలో హీరోల కుటుంబం అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు ఎప్పుడు మోగుతాయో తెలియదు కానీ... ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య, టాప్ హీరోయిన్ సమంతలు పెళ్లి చేసుకోనున్నారని ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇరువర్గాలు నోరెత్తకపోవడంతో ఇప్పుడిప్పుడే ఈ విషయంపై చర్చ కాస్తంత సద్దుమణిగింది. అయితే నిన్న హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఓ వివాహ వేడుక మరోమారు ఈ విషయంపై చర్చకు తెర లేపింది. ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు చైతూ, సమంతలు ఇద్దరూ కలిసి వెళ్లారు. కలిసి వెళ్లిన వీరిద్దరూ తమ బంధుగణంతో నవ్వుతూ తుళ్లుతూ కనిపించారు. మీడియాకు చిక్కిన వీరి ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. వెనువెంటనే సదరు ఫొటోలు వైరల్ గా మారగా... చైతూ, సమంతల పెళ్లి వార్తలు మళ్లీ జోరందుకున్నాయి.