Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్యాషన్ ఐకాన్ గా పీవీ సింధు!... వస్తాదులా దీపా కర్మాకర్!: గోపీచంద్ అకాడెమీలో ఒలింపిక్ స్టార్ల సందడి

రియో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో షట్లర్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... ఒక్కసారిగా స్టార్లుగా మారిపోయారు. ఇప్పటికే వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలు ప్రకటించగా... తాజాగా వారికి ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కూడా అందబోతున్నాయి. హైదరాబాదులోని పుల్లెల గోపీచంద్ అకాడెమీలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వారికి కార్లను అందించనున్నారు. ఇప్పటికే గోపీచంద్ అకాడెమీకి సచిన్ చేరుకున్నారు. ఇక సచిన్ కు ఆహ్వానం పలికిన ముగ్గురు క్రీడాకారులు వేర్వేరు వస్త్రధారణలో కనువిందు చేశారు. తెలుగు తేజం పీవీ సింధు అచ్చం ఫ్యాషన్ ఐకాన్ లా తెలుపు రంగు డ్రెస్సులో మెరిసిపోయింది. సాక్షి మాలిక్ నల్లటి కోటుతో అచ్చమైన క్రీడాకారిణిగా కనిపించింది. ఇక జిమ్నాస్టిక్స్ లో భారత్ సత్తా చాటిన దీపా కర్మాకర్ మాత్రం జీన్స్ ప్యాంట్, రెడ్ కలర్ టీ షర్ట్ తో వస్తాదుకు మల్లే రెజ్లర్ లుక్ లో కనిపించింది.

More Telugu News