: బంగ్లాదేశ్ లో భారీ ఎన్ కౌంటర్... 'ఢాకా కేఫ్' దాడి ప్రధాన కుట్రదారు తమీమ్ అహ్మద్ హతం


బంగ్లాదేశ్ లో ఈ ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఢాకా శివార్లలోని నారాయణ్ గంజ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారంతో సైన్యం, భద్రతాదళాలు సోదాలకు దిగగా, వారిని చూసిన ముష్కరులు కాల్పులకు దిగారు. భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో నలుగురు హతమైనట్టు అధికారులు తెలిపారు. ఢాకాలోని కేఫ్ పై గత నెలలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి, కెనడా పౌరుడు తమీమ్ అహ్మద్ చౌధురి మరణించిన వారిలో ఉన్నాడని పేర్కొన్నారు. ఢాకా ఘటనలో 22 మంది మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News