: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ తమిళనటుడికి హీరో విశాల్ ఆర్థిక సాయం
వ్యక్తిగత, ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డ తమిళ నటుడు ఇళవరసన్ కు హీరో విశాల్ ఆర్థిక సాయమందించాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇళవరసన్ ను విశాల్ కు చెందిన దేవీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పరామర్శించారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.10,000ను ఇళవరసన్ కు వారు అందజేశారు. అతని సమస్యలు తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తానని విశాల్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, రెండు రోజుల క్రితం ఇళవరసన్ ఆత్మహత్యకు యత్నించాడు.‘సిరుతయి’, ‘సగుని’ తదితర చిత్రాల్లో ఇతను సహాయ నటుడిగా నటించాడు.