: పోలవరం అప్పగిస్తా... బాధ్యత ఎవరు తీసుకుంటారు?: కాంగ్రెస్, వైకాపాలకు చంద్రబాబు సూటి ప్రశ్న


జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. పనులను కేంద్రానికి ఇచ్చేందుకు తాను ఎన్నడో సిద్ధమని చెప్పానని గుర్తు చేసిన ఆయన, పనులను పూర్తి చేసేందుకు కాంగ్రెస్, వైకాపాల్లో ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. పనులు చేసేందుకు ఎల్అండ్ టీ, ట్రాన్స్ ట్రాయ్ తదితర కంపెనీలు భారీ ఎత్తున యంత్రాలను రెడీ చేసుకున్నాయని, పనులు ఏమాత్రం ఆగినా వాటి నిర్వహణకూ డబ్బివ్వాల్సి వుంటుందని అన్నారు. ప్రాజెక్టు పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1800 కోట్లు ఖర్చు పెట్టగా, ఇప్పటివరకూ కేంద్రం నుంచి రూ. 100 కోట్లు మాత్రమే అందిందని అన్నారు. ఇంకో రూ. 1700 కోట్ల కోసం తాము ఎదురు చూస్తున్నామని, విపక్షాలు నిజాలను తెలుసుకోకుండా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, వైకాపాలు రాష్ట్రాన్ని కంపు చేశాయని, తాను ప్రక్షాళన చేసుకుంటూ వెళుతున్నానని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News