: బలూచిస్థాన్ లో రెపరెపలాడుతున్న త్రివర్ణపతాకం!
బలూచిస్థాన్ లో త్రివర్ణపతాకం రెపరెపలాడుతోంది. అదే సమయంలో పాకిస్థాన్ జాతీయ జెండా బలూచిస్థాన్ ఆందోళనకారుల కాళ్లకింద పడి నలిగిపోతోంది. భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోట సాక్షిగా బలూచిస్థాన్ కు భారత్ బహిరంగ మద్దతు ప్రకటించిన అనంతరం అక్కడ ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. పాక్ ఆర్మీ అరాచకాలపై గొంతెత్తుతున్న ఆందోళనకారులు, బలూచ్ హక్కుల నేతలను అరెస్టు చేయడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జమ్మూకాశ్మీర్ లో ముఖాలకు ముసుగులు ధరించి పాక్ జెండాలు ఎలా చేబూనుతారో... అచ్చం అలాగే ముఖాలకు ముసుగులు ధరించిన ఆందోళనకారులు భారత జాతీయ జెండాలు, భారత ప్రధాని మోదీ ఫోటోలు చేబూని నడిచారు. ఈ సమయంలో పాకిస్థాన్ జెండాను కాళ్ల కింద వేసి తొక్కారు.