: తెలంగాణ మంత్రి జోగు రామన్నకు తృటిలో తప్పిన పెను ప్రమాదం!


తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన కాన్వాయ్ లోని వాహనాలు 44వ నెంబర్ జాతీయ రహదారిపై వెళుతున్న వేళ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ ముందు కర్నూలు నుంచి నిర్మల్ వెళుతున్న ఓ బొలెరో వాహనం వెనుక టైర్ ఊడిపోయింది. వెనుకే వేగంగా వస్తున్న మంత్రి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం బొలేరోను ఢీ కొట్టగా దీనిలోని పోలీసులకు గాయాలు అయ్యాయి. ఆ వెనుకే రామన్న కారును నడుపుతున్న డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, సడన్ బ్రేకుతో వాహనాన్ని ఆపేశాడు. ఆపై వాహనం దిగిన మంత్రి ఎస్కార్ట్ సిబ్బందికి ఏమైనా ప్రమాదం జరిగిందా? అని విచారించి తన ప్రయాణాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News