: సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రపంజా... నలుగురు మృతి
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు వెళుతున్న కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేయగా, ఓ పోలీసుతో పాటు ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఈ తెల్లవారుఝామున జమ్మూ కాశ్మీర్ పరిధిలోని బారాముల్లా సెక్టార్ లో ఈ ఘటన జరిగినట్టు అధికారులు మీడియాకు తెలిపారు. మరో ఐదుగురు జవాన్లకు గాయాలు అయ్యాయని, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు పెద్దసంఖ్యలో బారాముల్లా ప్రాంతానికి చేరుకున్న సైన్యం, భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తోంది. ఉగ్రవాదుల దాడి ఘటనపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.