: బెలూచిస్థాన్ కోసం కాశ్మీర్ ను త్యాగం చేయాలనుకుంటున్నారా?: మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్న


బెలూచిస్థాన్ కోసం కాశ్మీర్ ను త్యాగం చేసేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తోందని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. కాశ్మీర్ సమస్యను బెలూచిస్థాన్ తో పోల్చుతూ, ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించడాన్ని ఆ పార్టీ నేత సంజయ్ నిరుపమ్ తప్పుబట్టారు. ఈ రెండు సమస్యలూ వేర్వేరని, కాశ్మీర్ గురించి ప్రస్తావిస్తున్నప్పుడల్లా, బెలూచిస్థాన్ ఇష్యూను ఆయనెందుకు ప్రస్తావిస్తున్నారని సంజయ్ ప్రశ్నించారు. "కాశ్మీర్ సమస్యను బెలూచ్ తో పోల్చడం సరికాదు. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే బెలూచ్ స్వాతంత్ర్యం కోసం కాశ్మీర్ ను త్యాగం చేయాలని అనుకుంటున్నారా? అని అనిపిస్తోంది. ఈ రెండు అంశాలనూ ఒకే వేదికపై ఎన్నడూ ప్రస్తావించరాదు" అన్నారు.

  • Loading...

More Telugu News