: కుమారుడికి తల్లి పోలికలు లేవంటూ తల్లిని చావగొట్టిన వైనం!
కొడుకుకి తల్లి పోలికలు లేవంటూ సదరు తల్లిని చావగొట్టిన ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్‌లో చోటుచేసుకుంది. బోగివాల్ ప్రాంతానికి చెందిన సాదియా అనే మహిళకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే, సాదియా ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిందని, అంతేగాక, ఆమె పదేళ్ల ఓ బాలుడిని ఎత్తుకెళుతోందని కొందరు భావించారు. తన వద్ద ఉన్న బిడ్డ తన బిడ్డే అని ఆమె ఎంతగా చెప్పినా ఆమె మాటలు ఎవరూ వినలేదు. సదరు మహిళ రంగు, కొడుకు రంగు ఒకేలా లేవంటూ సాదియాను 25 మంది చావబాదారు. గుంపుగా చేరి మహిళను కొడుతుండడంతో అక్కడి ఓ కుటుంబ సభ్యులు స్పందించి ఆమెను కాపాడారు. అనంతరం ఆమెను పోలీసులకి అప్పజెప్పారు. చివరకి పోలీసులు ఆ బాలుడు సాదియా కుమారుడేనని తెలుసుకొన్నారు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి ఆ మహిళ ఒప్పుకోకపోవడం విశేషం.