: హీరోగా నా విజయానికి కారణాలు ఆ రెండే: హీరో వెంకటేశ్
ముప్ఫై ఏళ్ల తన సినీ ప్రయాణంలో తాను హీరోగా విజయవంతమవడానికి గల కారణాలు ఆ రెండేనని చెప్పారు వెంకటేశ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక ఇమేజ్ కి పరిమితం కాకపోవడం, ఎలాంటి భావోద్వేగాన్నైనా పలికించగలిగేలా తనను తాను తీర్చి దిద్దుకోవడవల్లే తాను హీరోగా విజయవంతమయ్యానని చెప్పారు. ఏ ఇమేజ్ అయినా మనం తెచ్చుకుంటే వచ్చేది కాదని, అది ప్రేక్షకుల నుంచి రావాలని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. డబ్బు సంపాదించడం అందరికీ ముఖ్యమే కానీ, అప్పుడప్పుడు భగవద్గీతలో ఏం చెప్పారనేది కూడా చూడాలని మరో ప్రశ్నకు సమాధానంగా విక్టరీ వెంకటేశ్ బదులిచ్చారు. కాగా, నయనతారతో కలసి వెంకీ నటించిన ‘బాబు బంగారం’ చిత్రం ఈరోజు విడుదలైంది.