: చిన జీయర్ ఆశ్రమంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు


గుంటూరు జిల్లాలోని సీతానగరం వేద విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించేందుకుగాను సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు కలిశారు. పుష్కరాల్లో పాల్గొనాల్సిందిగా ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఉండవల్లి కరకట్టమీది తన రెస్ట్ హౌస్ నుంచి ఈ రోజు ఉదయం 11.30 గంటల సమయంలో చంద్రబాబు ఇక్కడి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వేద విద్యార్థులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలకగా, చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా ఆయన్ని ఆహ్వానించి తీసుకుని వెళ్లారు. పుష్కరాల సందర్భంగా చిన జీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహిస్తున్న యాగంలో చంద్రబాబు పాల్గొన్నారు. సీతారామలక్ష్మణుల విగ్రహాలకు ఆయన పూజలు చేశారు. అనంతరం వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.

  • Loading...

More Telugu News