: ఏలియన్స్ వచ్చి తనను ఎక్కడికో తీసుకెళుతున్నాయంటున్న బ్రిటన్ యువతి!


గ్రహాంతర వాసులు ఉన్నారా? లేదా? అన్న విషయంలో శతాబ్దాల నుంచి పరిశోధనలు సాగుతూనే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇంతవరకూ ఎటువంటి సాక్ష్యాలూ లభించక పోగా, 'ఎర్త్‌ మిస్టరీ' అనే న్యూస్ వెబ్‌ సైట్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బ్రిటన్ యువతి లీసా ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పింది. తనకు ఆరేళ్ల వయసు నుంచే ఏలియన్స్ తో పరిచయం ఉందని, వారు తన కుటుంబ సభ్యుల్లా మారిపోయారని చెబుతోంది. వారు వచ్చి తరచుగా తనను బయటకు తీసుకుపోతున్నారని, తన శరీరాన్ని తరచూ పరిశీలిస్తుంటే, అత్యాచారం జరిగిన అనుభూతి కలిగేదని చెబుతోంది. తన బెడ్ రూంకు వచ్చే ఏలియన్స్ పలుమార్లు అపహరించుకుపోయి తిరిగి తెచ్చి వదిలి పెట్టారని చెప్పింది. కాగా, ఈమె మాటలు నమ్మదగినవిగా లేవని ఏలియన్స్ పై పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News