: రజనీకాంత్ ట్విట్టర్ లో ఒకే ఒక్క పొలిటీషియన్ ని ఫాలో అవుతారట!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయనకున్న అభిమానులు తక్కువేమీ కాదు. ట్విట్టర్ ద్వారా రజనీని అనుసరించే అభిమానుల సంఖ్య 3.05 మిలియన్లు. మరి, అటువంటి సూపర్ స్టార్ రజనీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేవలం 19 మందిని మాత్రమే ఫాలో అవుతారట. ఆ పందొమ్మిది మందిలో ఒకే ఒక్క పొలిటీషియన్ ఉన్నారు. మామూలుగా రాజకీయాలకు దూరంగా ఉండే రజనీ ఒక పొలిటీషియన్ ను ఫాలో అవుతారనే విషయం ఎవరికైనా ఆసక్తి కల్పించకమానదు. అదేవిధంగా, ఎవరా పొలిటీషియన్ అనే విషయం తెలుసుకోవాలన్న ఉత్సుకత వెంటాడుతుంది. ఇంతకీ, ఆ పొలిటీషియన్ ఎవరో ఊహించగలరా?.. ఇంకెవరు సమ్మోహన శక్తి గల నేత, భారత ప్రధాని నరేంద్ర మోదీయే! కాగా, మోదీని ట్విట్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య 21.5 మిలియన్లు!