: పంచె కట్టులోనే ఫుట్ బాల్ ఆడిన బాబా రాందేవ్


ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్ పంచె పైకి ఎగగట్టి ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు. స్వచ్ఛ భారత మిషన్, భేటీ బచావ్-భేటీ పఢావ్ పథకాలకు నిధుల సేకరణలో భాగంగా ఢిల్లీలో సినీ నటులు, పార్లమెంటేరియన్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముగిసిన తరువాత రాందేవ్ కూడా కాసేపు బంతి వెనుక పరుగులు తీసి ఆకట్టుకున్నారు. కాగా, సినీ నటుల జట్టుకు అభిషేక్ బచ్చన్ నాయకత్వం వహించగా, రణ్ బీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, అర్జున్ కపూర్, డినో మోరియా తదితరులు ఫుట్ బాల్ ఆడారు. పార్లమెంటేరియన్ల జట్టుకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో కెప్టెన్ గా వ్యవహరించగా, టీఎంసీ ఎంపీ, భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ ప్రసూన్ బెనర్జీ, బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, పర్వేష్ వర్మ, కమలేష్ పాశ్వాన్, సతీష్ గౌతమ్, భోలా సింగ్, ఐఎన్ఎల్ డీ ఎంపీ దుష్యంత చౌతాలా, టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు ఆడారు. మ్యాచ్ వీక్షించేందుకు 800 నుంచి 200 వరకు టికెట్ వసూలు చేశారు. ఈ నిధులను ఆ రెండు పథకాలకు వినియోగించనున్నారు. ఈ పథకాలకు బాబారాందేవ్ విరాళమివ్వనప్పటికీ మ్యాచ్ లో ఆడిన ఎంపీలకు పంతజలి ఫుడ్స్ ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వడం విశేషం.

  • Loading...

More Telugu News