: కోహ్లీ బలహీనతలపై దృష్టి పెట్టిన కుంబ్లే
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అనిల్ కుంబ్లే పనితనం చూపించడం ప్రారంభించాడు. జట్టులో ఆటగాళ్ల బలహీనతలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ బలహీనతలపై దృష్టి సారించాడు. దీంతో బెంగళూరులో జరిగిన శిక్షణా శిబిరంలో జడేజా ఓవర్లో రెండుసార్లు అవుటవడంతో స్పిన్ బలహీనతను గుర్తించాడు. దీనితో పాటు వెస్టిండీస్ బోర్డ్ ఎలెవన్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో కూడా కోహ్లీ స్పిన్ ను ఎదుర్కోలేక చతికిలబడ్డాడు. దీంతో స్వతహాగా స్పిన్ దిగ్గజమైన కుంబ్లే మరోసారి బంతి పట్టాడు. ఎలా ఆడాలో కోహ్లీకి చూపించి, బౌలింగ్ కు దిగాడు. దీంతో కుంభ్లే తొలి బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ కోహ్లీ రెండో బంతిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇలా ప్రతి ఒక్కరి లోపాలను కుంబ్లే సవరించే ప్రయత్నం చేయడంతో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ప్రాక్టీస్ లో పాల్గొంటున్నారు.