Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దాక్కుని కాల్పులు జరిపినా.. ఆ ఫోను కనిపెట్టేస్తుంది

మన సినిమాల్లో లాగా.. దొంగచాటుగా ఓ భవనంలో ఎవరికీ కనిపించకుండా నిల్చుని వేదికమీద ఉన్నవారిని కాల్చేస్తే సులభంగా పారిపోవచ్చునని అనుకుంటే పొరబాటే. కాల్పులు జరిగిన స్థలంలో అసలు తుపాకీ ఎక్కడుంది? ఎక్కడినుంచి కాల్చారు? అనే వివరాలను కనిపెట్టగల సాంకేతికత ఇప్పుడు రూపొందింది.

అమెరికాకు చెందిన కంప్యూటర్‌ ఇంజినీర్లు స్మార్ట్‌ ఫోను ఆధారంగా పనిచేసే ఒక సాఫ్ట్‌వేర్‌ ద్వారా కాల్పులు జరిగిన ప్రదేశంలో అసలు తుపాకీ ఆచూకీని సులువుగా పట్టుకునే టెక్నాలజీ అభివృద్ధి చేశారు. వాండర్‌బిల్ట్‌ యూనివర్సిటీకి చెందిన కంప్యూటరు ఇంజినీర్లు ఈ ఘనతను సాధించారు.

More Telugu News