: తొలినాళ్లలో ఓ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు: 'మిషన్ ఇంపాజిబుల్' నటి తాండీ న్యూటన్
సినీ కెరీర్ ప్రారంభంలో చాలామంది హీరోయిన్లు పరిశ్రమలో ఏదో ఒకరకంగా వేధింపులు ఎదుర్కొంటారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసినవి లైంగిక వేధింపులు. ఈ ఆరోపణలను నిజం చేస్తూ 'మిషన్ ఇంపాజిబుల్' వంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన హాలీవుడ్ నటి తాండీ న్యూటన్ తన కెరీర్ ఆరంభంలో ఎదురైన అనుభవాన్ని ఇన్నేళ్ల తరువాత వెల్లడించింది. తన కెరీర్ ప్రారంభంలో ఓ డైరెక్టర్ లైంగికంగా వేధించాడని తెలిపింది. ఈ విషయాన్ని వీడియోగా చిత్రీకరించి, అతని స్నేహితులకు చూపించాడని తెలిపింది. ఇన్నేళ్ల తరువాత ఇక ఈ విషయాన్ని దాయవలసిన అవసరం లేదని ఆమె చెప్పింది. నేటి యువనటీనటులు అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోకి తమను తాము నెట్టేసుకోవద్దని ఆమె సూచించింది. ఇప్పుడు తనకు ఇద్దరు కుమార్తెలని చెప్పిన ఆమె, తనలా ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోరాదని భావించడం వల్లే ఈ విషయాన్ని బయటపెడుతున్నానని ఆమె చెప్పింది.