వీలు దొరికినప్పుడల్లా ధోనీ నుంచి టిప్ప్ తెలుసుకుంటూ వుంటాను!: వికెట్ కీపర్ వృద్ధి మాన్ సాహా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వీలు దొరికినప్పుడల్లా ధోనీ నుంచి టిప్ప్ తెలుసుకుంటూ వుంటాను!: వికెట్ కీపర్ వృద్ధి మాన్ సాహా

తనకు వీలు దొరికినప్పుడల్లా టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ ధోనీతో మాట్లాడుతుంటానని, సలహాలు తీసుకుంటానని యువ వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా అన్నాడు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత్ జట్టులో వృద్థిమాన్ సాహా స్పెషలిస్టు వికెట్ కీపర్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టెస్టు క్రికెట్ లో ధోనీ లేని లోటును భర్తీ చేయలేమని, వికెట్ కీపర్ గా ధోనిలా రాణించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోనీది ప్రత్యేక స్థానమని ప్రశంసించాడు. తనకు సమయం దొరికినప్పుడల్లా ధోనీని కలుస్తుంటానని, కీపర్ గా పలు టిప్స్ తెలుసుకుంటానని వృద్థిమాన్ చెప్పుకొచ్చాడు.

More Telugu News