: 'హే ట్రంప్ ఐ లవ్ యూ' అంటున్న రాంగోపాల్ వర్మ


అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఒక్కసారిగా ప్రేమ ముంచుకొచ్చింది. ఒర్లాండో క్లబ్ పై దాడి, ఆపై ట్రంప్ స్పందన చూసిన వర్మ, తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. "మంచి వారికి చెడు జరిగితే, చెడ్డ వారిపై మరింత ఉక్కుపాదం మోపాలి" అన్న ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, "హే డొనాల్డ్ ట్రంప్, ఇలా చెప్పినందుకు ఐ లవ్ యూ" అని వర్మ ట్వీట్ చేశాడు. "అమెరికన్లకు ఇప్పుడు రెండే చాయిస్ లున్నాయి. వారిని ట్రంప్ ఆశీర్వదించాలి, లేదంటే అల్లా ఆశీర్వదించాలి" అని కూడా అన్నాడు. టెర్రరిస్టుల పెద్ద ఆయుధం ఏమిటంటే సర్ ప్రైజ్ ఇవ్వడమేనని, గే క్లబ్ లో ఉన్న వారి వద్ద ఆయుధాలుంటే, ఈ ఘటన జరిగేది కాదని కూడా ఆయన వ్యాఖ్యానించాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే ట్రంప్ బెటర్ ఆప్షన్ అన్నాడు.

  • Loading...

More Telugu News