Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు పేరు ప్రస్తావనతో... మంత్రి జూపల్లి, రేవంత్ రెడ్డి వాగ్వాదం

మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ నేత రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చంద్రబాబు వల్లే పాలమూరుకు నీరు రావటం లేదన్న జూపల్లి వ్యాఖ్యలకు రేవంత్ మండిపడ్డారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం జోగారంలో జరిగింది. ఇక్కడ జరిగిన ఒక శంకుస్థాపనా కార్యక్రమంలో వాళ్లిద్దరూ పాల్గొన్నారు. చంద్రబాబు ప్రస్తావన ఈ సమావేశంలో తేవద్దంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటలయుద్ధం జరిగింది. తమ తమ నేతలకు మద్దతుగా టీడీపీ-టీఆర్ఎస్ శ్రేణులు నిలిచాయి.

More Telugu News