Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేతనాల కోసం ‘టోల్ గేట్’ మూసిన కార్మికులు!... బెంగళూరు హైవేపై నిలిచిన వందలాది వాహనాలు!

వేతన బకాయిల కోసం టోల్ గేట్ సిబ్బంది ఉద్యమ బాట పట్టారు. తాము పనిచేస్తున్న టోల్ గేట్ ను మూసేశారు. దీంతో జాతీయ రహదారిగా ఉన్న హైదరాబాదు-బెంగళూరు హైవేపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటన నేటి ఉదయం అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని టోల్ గేట్ వద్ద చోటుచేసుకుంది. టోల్ గేట్ లో పనిచేస్తున్న సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందడం లేదట. దీంతో అసహనానికి గురైన సిబ్బంది నేటి ఉదయం ఉన్నపళంగా ఆందోళన బాట పట్టారు. టోల్ గేట్ కు రెండు వైపులా గేట్లను కార్మికులు మూసివేయడంతో రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. టోల్ గేట్ యాజమాన్యం నిర్వాకం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

More Telugu News