Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్న ఎంపీ గుత్తా... అదే బాట పట్టనున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే?

టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మరో ఇద్దరు నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గులాబీ దళంలో చేరనున్నట్లు సమాచారం. కాగా, వీరిద్దరూ నిన్న సీఎం కేసీఆర్ ను కలవడం, ప్రభుత్వానికి అనుగుణంగా వ్యాఖ్యలు చేయడంతో ఆ ఇద్దరు నేతలు పార్టీలు మారతారనే నమ్మకం బలపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పూర్తి మద్దతిస్తున్నానని, రీ డిజైనింగ్ ను స్వాగతిస్తున్నానని చెబుతూ, టీ ప్రాజెక్టులపై ఏపీ సీఎం బాబు చేసిన వ్యాఖ్యలను గుత్తా ఖండించడం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, కేసీఆర్ ను కలిసిన విషయమై గుత్తా స్పందిస్తూ, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం విషయమై మాట్లాడేందుకే తాను కేసీఆర్ ను కలిశానని చెప్పారు.

More Telugu News