: నీలగిరి కొండల్లో సరదా సరదాగా రానా, రవితేజ, మంచు లక్ష్మి
నీలగిరి కొండల్లో తెలుగు సినీ నటులు రానా, రవితేజ, మంచు లక్ష్మి సరదా సరదాగా గడిపారు. ఈ విషయాన్ని రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. తమిళనాడులోని నీలగిరి కొండల్లో (ఊటీ పరిసరాలు) తాము సరదాగా గడిపామని రానా ఈరోజు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రవితేజ, మంచు లక్ష్మితో పాటు పలువురితో అక్కడి లొకేషన్స్‌లో దిగిన ఫోటోలను రానా ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. విహార యాత్ర కోసం కునూర్ ప్రాంతానికి వెళ్లామని.. కుటుంబం, స్నేహితులతో చల్లని ప్రదేశంలో గడిపి, తిరిగి హాట్ గా ఉన్న ప్రదేశానికి వచ్చామని రానా పేర్కొన్నాడు. నీలగిరి కొండల్ని ఇప్పుడు మిస్ అవుతున్నట్లు తెలిపాడు. చివరికి 'లవ్ మై రాక్స్' అని రానా పేర్కొన్నాడు.