: నా మనసుపై ముగ్గురు గాయాలు చేశారు... అయినా తట్టుకున్నాను!: ఎమీ జాక్సన్
ముగ్గుర్ని ప్రేమించానని, ఆ ముగ్గురూ తనను మోసం చేశారని, అయినా తట్టుకున్నానని 'ఎవడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఎమీ జాక్సన్ చెబుతోంది. ప్రేమ తనను గాయపరిచిందని ఆమె చెప్పింది. అదంతా మంచికే జరిగిందని ఆమె తెలిపింది. అప్పుడు జరిగిన సంఘటనలు తనను స్వతంత్రంగా ఆలోచించుకునేలా చేశాయని ఆమె చెప్పింది. తన మనసుపై ఒక్కొక్కరు ఒక్కోరకమైన గాయం చేశారని తెలిపింది. ఇంత జరిగినప్పటికీ సరైన ప్రేమ కోసం తన మనసు ఎదురు చూస్తూనే ఉందని ఎమీ జాక్సన్ వెల్లడించింది. ఎమీ జాక్సన్ ప్రస్తుతం 'రోబో 2.0' సినిమాలో రజనీకాంత్ సరసన నటిస్తోంది.