Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మళ్లీ కాల్పుల మోత.. ఇద్దరు సీఆర్ఫీఎఫ్ జవాన్ల మృతి

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరోసారి పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాంకేర్ జిల్లా టడోకి సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు సీఆర్ఫీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. గాయపడ్డవారిని హెలికాప్టర్ లో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజుల క్రితం కిష్ఠారం అడవుల్లో జరిగిన కాల్పుల్లో 10 మంది వరకూ మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.

More Telugu News