: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించిన కుక్క!
మానవత్వం, దయ, జాలి,కరుణ అనే పదాలకు అర్ధం తెలియని ముష్కరమూకకు ఓ కుక్క భయాన్ని రుచి చూపించింది. మతం మత్తులో దారుణాలకు పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ పై దాడులకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న బ్రిటన్ కు చెందిన సాస్ దళాలు నాలుగు వాహనాల కాన్వాయ్ తో సిరియాలోని కుర్షిద్ ప్రాంతంలో తమ స్ధావరానికి వెళ్తున్నారు. ఇంతలో 80 మంది కలిగిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల మూక సాస్ దళాలపై దాడికి దిగింది. హోమ్ మేడ్ బాంబులు, తుపాకీ కాల్పులతో విరుచుకుపడింది. సాస్ సైనికులు తేరుకునేంతలో వారితో పాటు ఉన్న అల్షేషన్ డాగ్ ఒక్కసారిగా మేల్కోంది. యుద్ధంలో ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో శిక్షణ తీసుకున్న ఆ కుక్క తన ప్రతాపం చూపింది. ఓ జీహాదీ మెడను, ముఖాన్ని కరిచింది, మరొకడిపైకి దూకి కాళ్లు, చేతులు పీకేసింది. దీంతో వారి అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఇంతలో సాస్ సైనికులు తమ సత్తా చూపడం మొదలుపెట్టారు. ఓ వైపు కుక్క, మరోవైపు సాస్ దళం...కుక్క దెబ్బకు ఠారెత్తిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పిక్కబలం చూపారు. దీంతో ఇప్పుడీ అల్షేషన్ డాగ్ ఇంగ్లండ్ లో హీరో అయిపోయింది.