: రాశిఖన్నా అలా అనేసరికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు: సాయిధరమ్ తేజ్
'సుప్రీం' సినిమా షూటింగ్ లో హీరోయిన్ రాశిఖన్నా నవ్వించినంతగా మరెవరూ నవ్వించలేదని హీరో సాయిధరమ్ తేజ్ తెలిపాడు. 'సుప్రీం' సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ, 'అందం హిందోళం... అధరం తాంబూలం' పాట షూటింగ్ ప్రారంభమైనప్పుడు తామిద్దరం చాలా ఇబ్బందిగా ఫీలయ్యామని అన్నాడు. క్లాసిక్ సాంగ్ ను పాడు చేస్తామేమో అన్న భయంతో ఇబ్బందిగా ఫీలయ్యామని, కొరియోగ్రఫీని చూసిన తరువాత టెన్షన్ పోయిందని అన్నాడు. అయితే రెండో రోజు షూట్ లో తను టెన్షన్ పడలేదని, రాశి మాత్రం టెన్సన్ పడుతోందని గమనించానని అన్నాడు. ఆమె టెన్షన్ పోగొట్టడానికి ఆమె దగ్గరకు వెళ్లి 'రాశీ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నిన్న చాలా బాగా డ్యాన్స్ చేశావ్ తెలుసా? అలాగే ఈ రోజు కూడా చేస్తావు...టెన్షన్ ఎందుకు?' అని సముదాయించే సరికి... 'ఆ విషయం తనకు తెలుస'ని చెప్పిందని...దాంతో ఎలా స్పందించాలో తనకు అర్థం కాలేదని, కాసేపటి తరువాత తేరుకుని నవ్వుకున్నానని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. ఇలాంటి సన్నివేశాలు ఈ సినిమా షూటింగ్ లో ఎన్నో ఉన్నాయని, అవన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటామని సాయిధరమ్ తేజ్ చెప్పాడు.