: పవన్ కన్నా బన్నీ చాలా ఎదిగిపోయాడు: దర్శకుడు రాంగోపాల్ వర్మ
‘సరైనోడు’ చిత్రంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటే బన్నీ చాలా ఎదిగిపోయాడని సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కంటే ‘సరైనోడు’ చిత్రం పెద్ద హిట్ కొట్టేసిందన్నారు. పవన్ కంటే అల్లు అర్జున్ చాలా ఎదిగిపోయాడనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. పవన్ తో బన్నీని పోల్చి చూసే ఆలోచన తనకు ఎన్నడూ రాలేదని, అయితే, ‘సరైనోడు’ చిత్రంతో అల్లు అర్జున్ ఎంతో ఎదిగిపోయాడంటూ వర్మ తన ట్వీట్ లో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.