: ఆఫీసు నుంచి యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లినా ప్రశ్నించే నాధుడే లేకపోయాడు!
సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. ముక్త్సర్ నగరంలోని ఓ కంప్యూటర్ సెంటర్ లో పని చేస్తున్న ఓ దళిత యువతిని ఆమె గ్రామానికే చెందిన ఓ వ్యక్తి ఈడ్చుకుంటూ వెళ్లి కారులో కుదేసి, ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి రాత్రంతా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఆఫీసు వారు కూడా సాక్ష్యం చెబుతామని ముందుకు వచ్చారు. ఆమెను లాక్కెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విశేషం. దీంతో బాధితురాలు జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించింది. సాక్ష్యాధారాలు ఉన్నా, ఇంత దారుణం జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలని జాతీయ ఎస్సీ కమీషన్ నోటీసులు జారీ చేసింది.