: ప్రధాని మోదీ విందుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్న విందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రేపు సాయంత్రం ఢిల్లీలో ప్రధాని విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరి వెళతారు. కాగా, ఆదివారం ఉదయం జరిగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.