: రాజ్యసభకు బీజేపీ సిఫారసు చేసిన పేర్లను ఆమోదించిన రాష్ట్రపతి
పార్లమెంటులో పెద్దల సభగా పరిగణిస్తున్న రాజ్యసభకు ఆరుగురు ప్రముఖులను నామినేట్ చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కీలక నిర్ణయం తీసుకుని, వారి జాబితాను రాష్ట్రపతికి పంపింది. ఈ జాబితాను పరిశీలించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ జాబితాలో మలయాళ నటుడు సురేష్ గోపీ, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, ప్రముఖ పాత్రికేయుడు స్వపన్ దాస్ గుప్తా, బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకాం, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ, ప్రముఖ ఆర్థిక వేత్త నరేంద్ర జాదవ్ ఉన్నారు.