Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అన్నగారి అభిమానిని... ఎన్టీఆర్ గార్డెన్స్ ను గుండెల్లో పెట్టుకుంటాం: కేసీఆర్

తాను ఎన్టీఆర్ కు వీరాభిమానినని, నక్లెస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్ అలాగే నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ 100వ చిత్రం ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ ను పదేపదే గుర్తు చేసుకున్నారు. మదరాసీలుగా పిలవబడుతున్న వారిని తెలుగువారుగా మార్చిన ఘనత ఆయనదేనని అన్నారు. "మా నాయకుడు ఎన్టీ రామారావు గారు. తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్డ. ఇటీవల అంబేద్కర్ గారి విగ్రహం పెడుతుంటే, కొంతమంది గిట్టనివాళ్లు దుష్ప్రచారం చేశారు. హైదరాబాద్ లో ఉన్నటు వంటి ఎన్టీఆర్ గార్డెన్స్ ఏదైతే ఉందో, అది చిరస్థాయిగా ఎన్టీఆర్ గార్డెన్స్ గానే ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే, ఆయన ఎన్టీ రామారావు గారు ఒక తరం నటుడు కాదు. జాతి గర్వించదగ్గ బిడ్డ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు పోయినా ఎన్టీఆర్ గారు తెలియని వారు లేరు. కాబట్టి అంత మహా నాయకుడు, అంతటి గొప్ప వ్యక్తి స్మారక చిహ్నం ఏదైనా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. వారి కొడుకుగా బాలకృష్ణ గారి 100వ చిత్రం అన్ని విధాలుగా విజయవంతం కావాలని, వచ్చిన పెద్దలు కూడా ఆశీస్సులు అందించాలి" అన్నారు.

More Telugu News