: బాలీవుడ్ భామ ఇషా గుప్తాకి తాజా ప్రపోజల్!


2012లో 'జన్నత్' సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన ఫెమినా మిస్ ఇండియా ఇషా గుప్తా 'రాజ్2', 'హెరాఫెరీ3', 'హమ్ షకల్స్' వంటి సినిమాల్లో నటించింది. గతంలో ఫిల్మ్ మేకర్ పునీత్ మల్హోత్రాతో అఫైర్ నడిపిన ఇషా, తరువాత బ్రేకప్ చెప్పింది. తాజాగా 'అతను ప్రపోజ్ చేశాడు... నేను ఒప్పేసుకున్నాను' అని ఇషా గుప్తా తన ఇన్ స్టాగ్రాంలో ఓ ఫోటో పోస్టు చేసింది. ఆ ఫోటోలో ఇషా గుప్తా వేలికి ఉంగరం ఉంది. దీంతో తనకు ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందని అభిమానులకు పరోక్షంగా చెప్పింది. అయితే ఆమె వేలికి ఈ ఉంగరం తొడిగిన వ్యక్తి ఎవరనే విషయం వెల్లడించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News