Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీ‌శ్రీ‌ ర‌విశంక‌రే మోదీ, కేజ్రీలను క‌లిపారు: కాంగ్రెస్

ప్ర‌తీ విష‌యంలోనూ విభేదించుకునే ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకరే ఒక‌ట‌య్యేలా చేశార‌ని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. పర్యావరణ విఘాతానికి కారణమవుతున్న ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం వారిద్ద‌రినీ క‌లిసేలా చేసింద‌ని మండిప‌డింది. శ్రీశ్రీ రవిశంకర్ ఆశీస్సుల వల్లే వీరిద్ద‌రి మధ్య స్నేహం మొగ్గతొడుగుతోందని కాంగ్రెస్ పార్టీ సెటైర్ వేసింది. ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం విషయంలో హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ విమర్శలు చేసిన నేపథ్యంలో, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తరహాలో వీరిద్ద‌రూ కూడా ఈ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉంటే బాగుండేద‌ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పీఎల్ పూనియా అన్నారు. హరిత ట్రైబ్యునల్ విధించిన జరిమానా కట్టబోనని మొద‌ట‌ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

More Telugu News