: జోరు మీదున్న స్టాక్ మార్కెట్లు... నేడూ లాభాలే!


ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 354 పాయింట్ల లాభంతో 24,606 వద్ద ముగిసింది. నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 7,475 వద్ద ముగిసింది. డాలర్ లో రూపాయి మారకపు విలువ రూ.67.38 వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో టాటా స్టీల్ సంస్థ షేరు ధర అత్యధికంగా 7.62 శాతం లాభపడి రూ.287.95 వద్ద ముగిసింది. లాభపడ్డ సంస్థల షేర్ల జాబితాలో బీహెచ్ఈఎల్, టాటా మోటార్స్, వేదాంత, లార్సెన్ ఉన్నాయి. కాగా, జీ ఎంటర్ టెయిన్ మెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, లుపిన్ సంస్థల షేర్లు నష్టపోయాయి. 2016-17 కేంద్ర బడ్జెట్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి.

  • Loading...

More Telugu News