వరంగల్ జిల్లాలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరంగల్ జిల్లాలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

వరంగల్ నగరంలో జిల్లా టీడీపీ కొత్త కార్యాలయాన్ని ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. వరంగల్ ప్రజలు సీఎం కేసీఆర్ ను త్వరలోనే సమాధి చేస్తారని ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యానించారు. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి దయాకరరావుకి చీమూ నెత్తురు ఉంటే కనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గరికపాటి, రేవూరి, వేం నరేందర్ రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

More Telugu News