క్రికెట్ కురువృద్ధుడు గరుడాచర్ ఇకలేరు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్రికెట్ కురువృద్ధుడు గరుడాచర్ ఇకలేరు!

కర్ణాటకకు చెందిన నాటి తరం క్రికెటర్ బీకే గరుడాచర్(99) ఈ రోజు ఉదయం మృతి చెందారు. మైసూర్ కి చెందిన ఆయన తన లెగ్ స్పిన్, గూగ్లీలతో బ్యాట్స్ మన్ కు ముచ్చెమటలు పట్టించేవారు. తన కెరీర్ లో 27 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచుల్లో 100 వికెట్లు తీసుకున్నారు. 29.63 సగటుతో 1126 పరుగులు చేశారు. గరుడాచర్ మృతిపై పలువురు సీనియర్ క్రికెటర్లు తమ సంతాపం వ్యక్తం చేశారు. కాగా, గరుడాచర్ వృత్తి రీత్యా ఇంజనీర్. వెస్ట్రన్ మెట్రోపొలిస్, యునైటెడ్ ప్రావిన్స్ లో పనిచేస్తున్న సమయంలో ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు.

More Telugu News