రైల్వే బడ్జెట్ అద్భుతం: మోదీ మెచ్చుకోలు
రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ప్రజలపై ఎంతమాత్రమూ భారం వేయకుండా, అభివృద్ధి దిశగా సాగేందుకు మార్గాలను సుగమం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రజారంజక బడ్జెట్ ను తెచ్చిన రైల్వే మంత్రికి, ఆ శాఖ సిబ్బందికి మోదీ అభినందనలు తెలిపారు. బడ్జెట్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. "గత ప్రభుత్వాల బడ్జెట్ లను విమర్శించబోను. ప్రస్తుత బడ్జెట్ వ్యయం రెండున్నర రెట్లు పెరిగింది. ఇది దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది. చార్జీలను పెంచకపోవడంతో ప్రయాణికులకు ఊరట కలిగింది. భారత్ ముందడుగులో రైల్వేలదే కీలక పాత్ర" అని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.