Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడప జిల్లాలో జగన్ పర్యటన... టీడీపీ 'ఆకర్ష్' నేపథ్యంలో నేతలతో చర్చలు

ఏపీలో అధికార పార్టీ టీడీపీ 'ఆకర్ష్'కు తెరలేపి వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని చేర్చుకున్నాక వైసీపీ అధినేత జగన్ అప్రమత్తమయ్యారు. ఢిల్లీ నుంచి నిన్న(బుధవారం) రాత్రి హైదరాబాదుకు వచ్చిన ఆయన ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ జిల్లాకు చెందిన మరో ముగ్గురు నేతలు టీడీపీలో చేరనున్నట్టు వస్తున్న వార్తలతో పార్టీ నేతలను పిలిపించుకుని ఆయన చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు కడప జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు జగన్ ను కలసి మాట్లాడారు. తామెవరం టీడీపీలోకి వెళ్లడంలేదని, వైసీపీలోనే ఉంటామని, కావాలనే టీడీపీ ఇలా ప్రచారం చేయిస్తోందని చెప్పినట్టు తెలిసింది.

More Telugu News