: కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్లకు రేపు అల్పాహార విందు


గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ అల్పాహార విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఈ విందు జరుగుతుంది. కాగా, రేపు ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. దీనికి ప్రిసైడింగ్ అధికారిగా రాహుల్ బొజ్జా వ్యవహరించనున్నారు. మేయర్ గా బొంతు రామ్మోహన్ ను, డిప్యూటీ మేయర్ గా బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్ ను టీఆర్ఎస్ ఖరారు చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News