ధనుష్ సినిమా షూటింగ్ లో విషాదం
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ తాజాగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ లో నేడు విషాద ఘటన చోటు చేసుకుంది. తిరువూర్ వద్ద సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, ఇక్కడి జలపాతంలో పడి ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మరణించారు. దీంతో, చిత్రబృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.