తెలంగాణలో ఇంటర్ ప్రయోగ పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 2న ప్రారంభం కావాల్సిన ఇంటర్ ప్రయోగ పరీక్షలు వాయిదా పడ్డాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలను తిరిగి ఫిబ్రవరి 5 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.