బాబా రాందేవ్ తో శిల్పాశెట్టి యోగ సాధన
ఆరోగ్యం, ఫిట్ నెస్ సొంతం చేసుకునేందుకుగాను ప్రముఖ సెలబ్రిటీలు యోగ సాధన వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ అందాల నటి, యోగా క్వీన్ శిల్పాశెట్టి చాలా కాలంగా ‘యోగ’ సాధన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, యోగ గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో ముంబయిలో నిర్వహిస్తున్న ఐదు రోజుల యోగ శిక్షణా శిబిరంలో శిల్పశెట్టి కూడా పాల్గొంది. రాందేవ్ తో కలిసి యోగాసనాలు వేసింది. ఈ సందర్భంగా శిల్పాశెట్టి రాసిన ‘ఆరోగ్యం-యోగ’ అనే పుస్తకాన్ని బాబా రాందేవ్ ఆవిష్కరించారు. కాగా, శిల్పాశెట్టి గతంలో ఒకసారి రాందేవ్ తో కలిసి యోగ సాధన చేసింది.