నాగోల్ లో ఫైర్ యాక్సిడెంట్... కాలి బూడిదైన హెచ్ డీఎఫ్సీ ఏటీఎం
హైదరాబాదులో నిన్న రాత్రి చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ప్రైవేట్ బ్యాంకు హెచ్ డీఎఫ్సీ ఏటీఎం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఏటీఎంలోని కరెన్సీ నోట్ల కట్టలు కూడా కాలిపోయాయి. నాగోల్ పరిధిలోని హెచ్ డీఎఫ్సీ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఆ మంటలు ఏటీఎం మిషన్ ను దహించివేశాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చేలోగానే మంటలు హెచ్ డీఎఫ్సీ ఏటీఎం పక్కనే ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంకు కూడా విస్తరించాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం కూడా పూర్తిగా కాలిపోకముందే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.