: పాకిస్థాన్ పై ఇంగ్లండ్ విజయం...సిరీస్ కైవసం

పాకిస్థాన్ తో జరిగిన నాలుగు వన్డేల సిరీస్ ను 3-1 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు బట్లర్ (116) వీర విహారం, జాసన్ రాయ్ (102), జోరూట్ (71) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 355 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ అజర్ అలీ (44), షోయబ్ మాలిక్ (52), బాబర్ అజామ్ (51) అర్ధ సెంచరీలతో ఫర్వాలేదనిపించినప్పటికీ విజయానికి అవసరమైన పరుగులు సాధించలేకపోయారు. దీంతో పాకిస్థాన్ జట్టు 40.4 ఓవర్లలో కేవలం 271 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్, సిరీస్ ఇంగ్లండ్ వశమయ్యాయి. ఈ మ్యాచ్ ద్వారా బట్లర్ మరో ఘనత సాధించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆరో ఆటగాడిగా రికార్డు పుటలకెక్కిన బట్లర్, ఇంగ్లండ్ జట్టు తరఫున అత్యంత వేగవంతమైన తొలి రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు.

More Telugu News