: మాలిలో 10 రోజుల పాటు ఎమర్జెన్సీ విధింపు

పశ్చిమాఫ్రికాలోని మాలిలో ఎమర్జెన్సీ విధించారు. తమ దేశంలో పది రోజుల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహాం బవుబాకర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే మూడు రోజులపాటు సంతాప దినాల్ని కూడా ప్రకటించారు. మాలి రాజధాని బమాకోలో నిన్న (శుక్రవారం) ఉగ్రవాదులు రాడిసన్ బ్లూ రెస్టారెంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు. బందీలుగా తీసుకున్న 170 మందిలో 27 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

More Telugu News