: విజయవాడలో టీడీపీ- పీవీపీ వివాదం

విజయవాడలో పీవీపీ మాల్ ఎదుట ఆటోస్టాండ్ వివాదం రాజుకుంది. పీవీపీ మాల్ ఎదురుగా రాత్రికి రాత్రి ఆటోస్టాండ్ వెలసింది. మాల్ ఎదురుగా ఆటో స్టాండును ఏర్పాటు చేసి, అక్కడ టీడీపీ నేత గద్దే రామ్మోహనరావు ఫ్లెక్సీలు, టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారు. దీనిని నేటి ఉదయం గమనించిన పీవీపీ మాల్ సిబ్బంది ఆ జెండాలను పీకేశారు. దీంతో వివాదం రాజుకుంది. పీవీపీ మాల్ సిబ్బంది వ్యవహార శైలికి నిరసనగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. వారికి టీడీపీ కార్యకర్తలు జత కలిశారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ, మాల్ యాజమాన్యం తీరు సరికాదని, తమకు తల్లి లాంటి పార్టీ జెండా మీద చెయ్యివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ వివాదం ముదరడంతో పోలీసులు చేరుకుని సర్దిచెబుతున్నారు.

More Telugu News