: మీకు టీవీ చూసే అలవాటుందా?...అయితే కాస్త జాగ్రత్త పడండి!


ఈరోజుల్లో టీవీ చూడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే, ఏదయినా శృతిమించితే ప్రమాదమేనన్న విషయం అందరికీ తెలిసిందే. టీవీని చూడడంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని అమెరికా నేషనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు. టీవీ చూసే అలవాటు, అనారోగ్య సమస్యలపై పరిశోధనల్లో భాగంగా రెండు లక్షల ఇరవై వేల మందిపై పరిశోధనలు చేసిన అమెరికా శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలు కనుగొన్నారు. సరదాగా గంట లేక అరగంట టీవీ చూడడంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపిన పరిశోధకులు, ఈ అలవాటు మూడు నుంచి నాలుగు గంటలుగా ఉందంటే మాత్రం ప్రమాదంలో పడినట్టేనని హెచ్చరిస్తున్నారు. నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూసే వారికి కేన్సర్, గుండె జబ్బులు వంటి 8 రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. అమెరికాలో కేన్సర్, గుండె ఎటాక్, డయాబెటిస్, పార్కిన్సన్స్, న్యూమోనియా వంటి జబ్బులతో బాటు కాలేయ సమస్యలతో కూడా ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News