: యాపిల్ ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ భారత్ ధరలివే!


ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ భారత్ లోని ధరలు వెల్లడయ్యాయి. తొలుత ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా వీటిని అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఫోన్లు గోల్డ్, రోజ్ గోల్డ్, స్పేస్ గ్రే రంగుల్లో లభిస్తుండగా, వీటి ధరలు ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 64,836 నుంచి రూ. 88,478 మధ్య ఉంటాయని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ (16 జీబీ) ధర రూ. 64,836 కాగా, 128 జీబీ ధర రూ. 83,401 అని పేర్కొంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ వేరియంట్ లో 16 జీబీ ధర రూ. 74,117, 64 జీబీ ధర రూ. 83,401, 128 జీబీ ధర రూ. 88,478 రూపాయలని వివరించింది. ఈ మేరకు ముందస్తు ఆర్డర్లు తీసుకోవాలని యాపిల్ నుంచి తమకు వర్తమానం వచ్చినట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

  • Loading...

More Telugu News